ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కోర్టు ఉత్తర్వులను కలెక్టర్ కు అందించిన భూ నిర్వాసిత రైతులునష్టపరిహారం గురించి రైతులతో చర్చించాలని వినతి 

కోర్టు ఉత్తర్వులను కలెక్టర్ కు అందించిన భూ నిర్వాసిత రైతులు
నష్టపరిహారం గురించి రైతులతో చర్చించాలని వినతి 

అర్జున్ సమాచారం/ ఆగస్టు 8 ముత్తారం. ప్రతినిధి

వ్యవసాయమే జీవనాధారంగా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న రైతులను సంప్రదించకుండా ఏకపక్షంగా భూములను స్వాధీనం చేసుకోవడాన్ని నిరాశిస్తూ నిర్వాసిత రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా రైతుల పక్షాన వచ్చిన హైకోర్టు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు దర్యాపూర్ నిర్వసిత రైతులు అందజేశారు ఈ సందర్భంగా భూ నిర్వాసిత రైతులు మాట్లాడుతూ, ముత్తారం మండలం లోని దర్యాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ భూములలో గోదాముల నిర్మాణం కోసం ప్రజాప్రయోజనం పేరుతో, చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించకుండా, ఎలాంటి నోటీసులు , ఉత్తర్వులు జారీ చేయకుండా పనులు చేస్తామని అధికారులు భారీ యంత్రాలతో రావడంతో రైతులు పనులను అడ్డుకున్నారు అధికారులు భూసేకరణ చేసే ముందు సంబంధిత నిర్వాసిత రైతులతో నష్టపరిహారం చెల్లింపు విషయంలో చర్చించి రైతుల ఆమోదంతో పనులు చేపట్టాలని పలుమార్లు రైతులు అధికారులకు విన్నవించుకున్న ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించకుండా ఆ భూములలో జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకిస్తూ మొత్తం 23 మంది పిటిషనర్లు ధర్యాపూర్ కేశన్‌పల్లి గ్రామాల నిర్వహిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లు 1 నుండి 17 వరకు తమ పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై, ఈ-పట్టాదార్ పాస్‌బుక్లు మరియు టైటిల్ డీడ్లు పొందారని తెలిపారు. పిటిషనర్లు 18 నుండి 23 వరకు ఇంకా పాస్‌బుక్లు పొందకపోయినా ఆయా భూములలో స్వాధీనంలో ఉండి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు ప్రభుత్వ అధికారులు నిర్వాసిత రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, చట్ట ప్రక్రియను అనుసరించకుండా భూముల్లోకి ప్రవేశించి వారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిర్వసిత రైతులు పలు మార్లు వినతిపత్రాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.రెవెన్యూ శాఖ తరఫు ప్రభుత్వ సహాయ న్యాయవాది, భూములు ప్రజాప్రయోజనం కోసం అవసరమైతే, ప్రతివాదులు తప్పనిసరిగా చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించిన తరువాతే చర్యలు తీసుకుంటారని కోర్టుకు తెలిపారని స్థానిక అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను
ఉల్లంఘిస్తూ నిర్వసిత రైతులను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్వసిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు రైతులు తెలిపారు ఈ కార్యక్రమంలో జంగస్వామి నిర్వాసిత రైతులు పాల్గొన్నారు